సమాచార సహకారంతో ప్రజలలో భాధ్యతను పెంపొందించుదాం
Search
 
 
 
కార్యాలయం నిర్మాణం
గ్రామ స్ధాయిలో సమాచార వ్యవస్ధను నెలకొల్పడమే 'విస్టా' లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో భాగంగా స్ధానిక ప్రజలకు సరైన శిక్షణ ఇచ్చి, వారు తమ అభివృద్ధి పనుల కోసం ఈ సాంకేతికతను వినియోగించుకోవడానికి 'విస్టా' కృషి చేస్తున్నది. అయితే ప్రజలు తమ సమాచార విజ్ఞానాన్ని, స్వేచ్ఛగా అభివృద్ధి పర్చుకోవడానికి వీలుగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని మేము భావించాం. ఈ విషయంపై గ్రామసభల్లో పలు సార్లు చర్చించడం జరిగింది. ఈ 'సెంటర్' నిర్మాణం నిమిత్తం గ్రామ పంచాయతీ ముందుకు వచ్చి కొంత భూమిని కేటాయించింది. వెనువెంటనే 'విస్టా' నిర్మాణం చేపట్టింది. ఆఫీసుకు గత ఏడాది 2006 ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం చేశాం.
 
Click here for Telugu Click here for English Click here for French