'విస్టా' కు స్వాగతం
ప్రజాస్వామ్యబద్ధంగా సమాచారం
'విస్టా' అంటే కార్యాచరణ కోసం రూపొందించిన దృశ్యసమాచార విధానాలు - గ్రామీణ అభివృద్ది,సమాచార సాంకేతిక రంగంలో నిష్ణాతులైన కొంతమంది నిపుణులం కలిసి 'విస్టా' ను ఏర్పాటు చేసుకున్నాం.సమాచారానికి మరింత ప్రజాస్వామ్యబద్దత కల్పించి, అందరికి అందుబాటు లోకి తేవాలన్న ఉమ్మడి లక్ష్యంతో నిర్విరామంగా కృషి చేస్తున్న సంస్ద 'విస్టా'.
'విస్టా' అంటే విస్తృత మానసిక దృష్టి.ఆయా కాలాలలో, ఆయా సంఘటనలు,విషయాలపై అవగాహన,
చైతన్యం కలిగివుండే మానసిక పరిణతి సాధించిన దూరదృష్టి ఇటాలియన్ భాషకు సంబందించిన "వెడెరె(VEDERA)" అను పదము నుండి 'విస్టా' అను పదము గ్రహించబడినది.దీని అర్దం 'చూడడం.'
మానవ మేధ ఓ అద్బుతమైన శక్తి.మనిషి మెదడుకు సరైన,అర్దవంతమైన సమాచారాన్ని అందిస్తే అది సాధించలేనిది ఏమి లేదని మా భావన.మేధో వికాసం ద్వారా గ్రామీణులను చైతన్యపరచి,వారిని అభివృధ్ధి పధంలో నడిపించి
గ్రామీణ భారతంలో వారి అభివృధ్ధికి వారినే కర్తలుగా రూపొందించే బృహత్తర కార్యక్రమాన్ని 'సమాచారం' సాధించగలదని మా
విశ్వాసం.
సమాచారంలో..పనిలో భాగస్వామ్యం
సమాచారాన్ని కలిసి పంచుకోవడం తద్వారా అభివృధ్ధిని సాధించడం మా ముఖ్య లక్ష్యం.సమాచారాన్ని
అందరికి అందుబాటు లోకి తేవడం ద్వారా స్ధానిక సంఘాలు, సంస్దలతో కలిసి పని చేయడం పరిపాలనలోని అన్ని స్దాయిలను
కూడ అభివృధ్ధి సాధనలో భాగస్వామ్యులను చేయడం మా 'ప్రణాళిక' ప్రధాన ఉధ్దేశం.
|