అమ్రాబాద్ మండలంలో ఎస్.హెచ్.జి ల సమాఖ్య ఏర్పాటు. |
|
ఒక శక్తివంతమైన సమాచార వ్యవస్ధను ఏర్పాటు చేయడానికి సామాజిక సంఘాల సహకారం ఎంతో అవసరం.
సమాచారాన్ని త్వరిత గతిన విస్తృతపరచడానికి గాని, అభివృధ్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి కాని ఈ సంస్ధలు
ప్రధాన వేదికగా వున్నందున వాటిని మరింత పటిష్టంగా, వ్యవస్ధీకృతంగా తీర్చిదిద్ధాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ లక్ష్యసాధన నిమిత్తం, మొత్తం సామాజిక సంఘాల (సిబివోలు) గురించి సవివరమైన అధ్యయనం నిర్వహించారు. ఈ
వ్యవస్ధలను మరింత సమర్ధవంతంగా పని చేయించేలా చర్యలు చేపట్టారు. ఒక స్పష్టమైన ఎజెండాతో క్రమం తప్పకుండా
సమావేశాలను నిర్వహించారు. సమావేశాల నిర్వహణ, ఆవశ్యకత, రుణాల చెల్లింపు, ప్రజాహిత కార్యకలాపాలలో
భాగస్వామ్యం, బుక్ కీపింగ్ తదితర అంశాల గురించి వారికి సరైన అవగాహన కల్పించారు. దానితో సుమారు 16
సంఘాలు క్రమబద్ధీకరించబడగా, వాటిలో 9 గ్రూపులకు బ్యాంకు రుణాలు అందచేయటానికి 'పడార గ్రామీణ బ్యాంకు'
ముందుకు వచ్చింది. దీనిని బట్టి వాటి పనితీరు ఎంత బాగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు. ఒకే సారి ఇన్ని
గ్రూపులను తయారుచేసుకున్న ఏకైక గ్రామంగా ఈ మండలానికే గర్వకారణంగా తయారైంది. ఇక మహిళా
ప్రతినిధులతో కూడిన వివో (గ్రామ సంఘం) అత్యంత సమర్ధవంతంగా పనిచేసి మండలంలోని ఐదు ఉత్తమ వివోల్లో
ఒకటిగా ఎంపికైంది. దీని వల్ల సూక్ష్మ రుణ పధకం (MCP) కింద ఈ వివోకు 20 లక్షల రూపాయలు మంజూరు
చేశారు.
ఈ వివోతో పాటు అన్ని సిబివోలకు చెందిన ప్రతినిధులతో కలిపి ఒక సమాఖ్య ఏర్పాటు చేశారు. ఇప్పుడు గ్రామానికి
సంబంధించిన సమాచారం, ఎంపికలు, నిర్ణయాలు, పధకాలు, ప్రణాళికలు అన్నీ ఈ సమాఖ్య ద్వారానే
నిర్వహిస్తున్నారు. |