సమాచార సహకారంతో ప్రజలలో భాధ్యతను పెంపొందించుదాం
Search
 
 
 
నీటిలో వున్నటువంటి ఫ్లోరైడ్ శాతం మీద సర్వే
నీటిలో వున్నటు వంటి ఫ్లోరైడ్ శాతం గురించి తెలుసుకొనుటకు అమ్రాబాద్ మండలములో వున్నటువంటి మద్దెమడుగు, మారెమడుగు, ఇప్పలపల్లె మరియు చిట్లంకుంట గ్రామాలలో సర్వే నిర్వహించినాము. ఈ గ్రామాలలో వున్న నీటి కొళాయిలు, చెరువులు మరియు ట్యాంకులు, ఇలా అన్ని రకాలుగా లభ్యమవుతున్న నీటిని తీసుకొని ఆ నీటిలో ప్లోరైడ్ శాతం గురించి తెలుసు కొనుటకు హాక్ కలోరి మీటర్ మరియు ప్రాబబుల్ టెస్టింగ్ కిట్ ద్వారా 57 రకాల నీటిని పరీక్షించాము, పరిశీలించాము.
     
     
ఈ 57 రకాల నీటిలో 27(48%) రకాలలో వుండవలసిన ఫ్లోరైడ్ శాతం కన్నా అత్యధికంగా నమోదయింది. మరియు 15 రకాలలో సరిగ్గా 1.5 ppm ఫ్లోరైడ్ శాతం నమోదుకాగ మిగిలినవి సురక్షితమైన త్రాగునీరుగా నమోదయినవి.అనంతపూర్ మరియు కర్నూలు లో ఊన్నటువంటి లేబరేట్రీస్ పరీక్షించగా పైన తెలుపబడినటువంటి ఫలితాలతో సరితూగినాయి.
ఒక్క చిట్లంకుంట గ్రామంలోనే వున్నటువంటి వనరులలో (65%కన్నా ఎక్కువ) ఫ్లోరైడ్ వుండ వలసిన దానికన్నా అధికంగా నమోదయింది.దాదాపు లభ్యమవుతున్నటు వంటి అన్ని నీటి వనరులలో ఫ్లోరైడ్ శాతం అత్యధికంగా నమోదయింది.ఆ వూరిలో జరిగేటటువంటి గ్రామ సభలో ప్రజలందరి ముందు చిత్రపటాల ద్వారా ఎక్కడెక్కడ ఫ్లోరైడ్ శాతం గల్గిన నీరు వుందో చూపించటం జరిగింది. అంతేగాక నీటిలో ఫ్లోరైడ్ శాతం పెరగడానికి గల కారణాలు, అటువంటి నీరుత్రాగటం వలన వచ్చే వ్యాధుల గురించి చిత్రపటాల ద్వారా మాప్స్ ద్వారా వివరించి చెప్పినాము.
 
ఫ్లోరైడ్ వున్నటువంటి నీటిముందు ఆ వూరి ప్రజలతో చర్చించడము.
ఆ ఊరిలో ఫ్లోరైడ్ శాతం అత్యధికంగా వున్న ప్రదేశాలను ఫోటోల ద్వారా చూపించడం.
   
     
 
Click here for Telugu Click here for English Click here for French