సమాచార సహకారంతో ప్రజలలో భాధ్యతను పెంపొందించుదాం
Search
 
 
 
 
రైతులు, యువకులు మరియు మహిళల వలసలను తగ్గించుట.
  1. గ్రామంలో ప్రజల నుండి మరోక 14 గ్రూపులను తీసుకొని వారికి జానపద పాటల ద్వారా, చిత్రాల ద్వారా కలసికట్టుగా పనిచేస్తే కలిగే లాభాలను వివరించి చెప్పి వారందరితో ఒక ప్రణాళికా బద్దంగా సభలను నిర్వహించడం.
  2. గ్రామంలో వున్నటువంటి స్థానిక ప్రజాసంఘాలకి వ్యవసాయ శాఖ వారితో, నీటిపారుదల శాఖ వారితో, గ్రామీణ బ్యాంక్ వారితో వెలుగు పథకం సభ్యులతో పరిచయాలను పెంచడం.
  3. (స్థానిక ప్రజాసంఘాలను అన్ని రకాలుగా అభివృధ్జి చేయడానికి) అన్ని స్థానిక సంఘాలను కలుపుకొని ఒక పటిష్టమైన సంఘాన్ని నెలకొల్పి, ఆ సంఘ సభ్యులకు సంఘానికి దోహదపడే విషయాలలో శిక్షణ ఇవ్వటం జరుగుతుంది.
 
రైతుల గ్రూపు
వెనుకబడిన తరగతులు
 
అభివృద్ది చెందిన కులాలు
   
దళిత సభ్యులు
(వర్మి) సేంద్రీయ ఎరువులు:-
  1. సేంద్రీయ ఎరువులను తయారు చేసే కేంద్రాలను ఎక్కువగా నెలకొల్పాలని గ్రామ సభలలో చర్చించడం జరిగింది. సేంద్రీయ ఎరువులకు సంబంధించినటు వంటి చిత్రపటాలను తయారు చేయటం, సీడీలను సేకరించి ఈ సేంద్రీయ ఎరువుల వలన భూసారం ఎలా అభివృధ్ది చెందుతుందో వివరంగా చర్చించడం జరిగింది. రైతులు రసాయనిక ఎరువులు ఉపయోగంచి పంటలను పండించటానికి, సేంద్రీయ ఎరువులు ఉపయోగించి పండించటానికి అయ్యే ఖర్చు మరియు పండించిన పంటలో వున్నటువంటి తేడాను రైతులు గ్రహించగలిగారు.
  2. సేంద్రీయ ఎరువుల ఉపయోగించటం వలన సంఘంలో లాభపడినటువంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడం.
శ్రీ వరి సాగు

శ్రీ వరి సాగు పద్దతులతో కనుక పంటను పండించినట్లయితే తక్కువ నీటిని వినియోగించుకోని ఎక్కువ పంట రాబడిని పొందవచ్చునని రైతులతొ వివరించి చెప్పడం జరిగింది.ఈ చర్చల ఫలితంగా గ్రామంలో వున్నటువంటి మాధవ రెడ్డి అనే రైతు శ్రీ వరి సాగు పద్దతిలో సేంద్రియ ఎరువులను ఉపయోగించి పంటలను పండించటం జరిగింది.మేము తను అవలంభించిన పద్దతిని మిగిలిన రైతులకు వివరించి చెప్పమని అడగటం జరిగింది.ప్రక్క గ్రామల నుంచి కూడ ప్రజలు శ్రీ వరి సాగు పద్దతి గురించి క్షుణంగా తెలుసుకొని అవలంభించడానికి మాధవ రెడ్డి గారి దగ్గరకు రావడం జరిగింది,కాని చిట్లంకుంట లో నివసించే రైతులు మాత్రం శ్రీ వరి సాగు పద్దతిలో మాత్రం పంటలను పండించటానికి సుముఖంగా లేరు.ఈ పద్దతిని రైతులందరు అవలంభించడానికి ఎక్కడెక్కడయితే శ్రీ వరి సాగు పద్దతులు పంటను పండింస్తున్నారో వారందరితో చిట్లంకుంట రైతులను తీసుకొని వెళ్ళి శ్రీ వరి సాగు పద్దతి గురించి చర్చించవలెను.

సుగంధ మరియు వైద్య వనములు:

సుగంధ మూలికలు మరియు వైద్యానికి సంబంధించిన వనములను కొని వాటిని అభివృధి చేయవలెను అనేది మా ప్రణాళికలో ఒక భాగం.

త్రాగునీటి వృధా:
  • ప్రజలకు త్రాగునీటిని వృధా చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అన్న అంశం పైన చర్చించి వారిలో మార్పును తీసుకురావడం కోసం కృషిచేయడం.
  • గ్రామసర్పంచ్ మరియు గ్రామ సెక్రటరీతో గ్రామంలో వున్నటువంటి నీటి పారుదలను ఎలా అభివృధ్ది పరచుకోవాలో ఎటువంటి మరమ్మత్తులు జరపవలెనో, త్రాగునీరు ఎలా వృధా అయిపోతుందో ముఖ్యంగా సరైన నీటిపైపులు, పాడయిపోయినటువంటి టాప్ లను సరిచేయటం వలన ఎంత నీటిని వృధా కాకుండా కాపాడుకోవచ్చో అనే విషయం మీద చర్చ జరిగింది.
  • త్రాగునీరు వృధా కాకుండా నీటిని కాపాడుకోవడం అనేది గ్రామంలో ముఖ్యమైన అంశంగా మారి అందరు ఈ విషయం గురించి ఆలోచించడం జరిగింది. ఫలితంగా ST(తాండ)కు చెందిన వారు, వారు నివసిస్తున్న వీధిలోవున్నటువంటి నీటికుళాయిలకు నాణ్యమైన టాప్స్ ను అమర్చారు.
  • పశు గ్రాసం

    గ్రామంలో వున్నటు వంటి పశు గ్రాసంను అభివృద్ది పరచుకోవటానికి అవలంభించాల్సిన పద్దతులను స్వయం సహాయక భృందాలకు వివరించి చెప్పటం.

    గ్రామంలో వున్న నీటిట్యాంకులు:
    గ్రామ సమైఖ్య సంఘం వాళ్ళు గ్రామంలో వున్నటువంటి నీటిట్యాంకులను క్షుణ్ణంగా తెలుసుకోవాలని నిర్ణయించారు. గ్రామంలో వున్నటువంటి పెద్దమనుష్యులు, గ్రామ సమైఖ్య సంఘం వారు మరియు నీటి వినియోగ దారుల సంఘం సభ్యులు ఇంకా ఆ వూరి పరిసరాల మీద అవగాహన వున్నవారిని కలిపి మురుగు కాల్వల నిర్మాణం మీద ఒక ప్రణాళికలను తయారుచేయవలెను.
    ప్రచురణ: గ్రామచరిత్ర

    (గ్రామ సహాయకులు) చిట్లంకుంట లో వున్నటువంటి గ్రామ సహాయకులు వారంతట వారే తమ గ్రామములో నివసించుచున్న ప్రజల జీవిత విధానాలను చిన్న చిన్న కథలుగా చేసి ఒక సంపుటిగా తయారు చేసినారు.

     

     
    CClick here for English Click here for Telugu Click here for French