గ్రామంలో మేము కుటుంబ వివరాలు సేకరిస్తున్న సమయంలో - ఊరిలో పశుసంపద బాగా ఉందని,
అయితే, వ్యాధి నిరోధక టీకాలు వేయించకపోవడం వల్ల పశువులు ఎక్కువగా మరణిస్తున్నాయని తెలిసింది. దీనిపై
ప్రజలు మాట్టాడుతూ, తాము ఎక్కువగా పశుసంరక్షణ మరియు వ్యాధి నిరోధక విభాగంపైనే ఆధారపడతామని,
స్వయంగా టీకాలు వేయించుకునే ఆర్ధిక స్ధోమత తమకు లేదని అన్నారు. దీనిపై మేము గ్రామ 'గోపాలమిత్ర'
శ్రీ రామలింగం గారి సహాయంతో గ్రామంలో పశువులకు వచ్చే వ్యాధులు, కాలానుగుణంగా వచ్చే రోగాలు, వాటి
నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సవివరమైన అధ్యయనం నిర్వహించాం. పశువుల మందుల విషయం
చర్చించడానికి డిపార్ట్ మెంట్ కార్యాలయానికి కూడా వెళ్ళాం. కాని, టీకాల మందు కొరత తీవ్రంగా వుందని, సరఫరా
అవుతున్న మందులు మండలంలోని పశువులకు చాలడం లేదని అధికారులు తెలిపారు. |