సమాచార సహకారంతో ప్రజలలో భాధ్యతను పెంపొందించుదాం
చెరువుల సర్వేలు
శిక్షణ పొందిన గ్రామ సహాయకులు గత ఏడాది మే, జూన్ మాసాల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు ప్రాంతం, అనంతపురం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో గల చెరువులపై సర్వే నిర్వహించారు. విస్తృత స్ధాయిలో చెరువుల మరమ్మతుకు చర్యలు చేపట్టడానికి ముందుగా నీటి పారుదల విభాగానికి చెందిన 'CADA' ఈ సర్వేకు రూపకల్పన చేసింది.
మొదట ఇంగ్లీషులో వున్న 'ప్రశ్నావళి'ని తెలుగులోకి అనువదింపచేసి తెలుగు 'డేటా బేస్' రూపొందించడం జరిగింది. దీని వల్ల గ్రామ సహాయకులు తాము సేకరించిన వివరాలను కంప్యూటర్ లలో నిక్షిప్తం చేయడం సులువుగా మారింది. అదే సమయంలో నీటి పారుదల శాఖ అభివృధ్ధి పరచిన ఇంగ్లీషు 'డేటా బేస్'తో దానిని అనుసంధానం చేయడం వల్ల గ్రామ సహాయకులు సేకరించిన సమాచార వివరాలు నీటి పారుదల శాఖకు తక్షణమే చేరిపోయాయి. దానిని బట్టి అర్ధమైంది ఏమంటే - గ్రామస్ధులకు సరైన శిక్షణ ఇచ్చినట్లయితే - మొత్తం వ్యవహారం తమ మాతృ భాషలో జరిగినట్లయితే గ్రామస్ధులు సమర్ధులైన సర్వేయర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా రూపొందగలరని రుజువైంది.
టింబక్టు కలెక్టివ్ (NGO) వారితో కలిసి గ్రామసహాయకులకు శిక్షణ మరియు అధికారిక సమాచార సేకరణ.
సర్వే తర్వాత వచ్చిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న దృశ్యం.
WUA ప్రతినిధులతో, ఇతర గ్రామస్ధులతో సామూహిక చర్చలు జరుపుతున్న దృశ్యం.న్న దృశ్యం.