సమాచార సహకారంతో ప్రజలలో భాధ్యతను పెంపొందించుదాం
సుగంధ మరియు ఔషధ మొక్కల పెంపకం విషయంలో గ్రామస్దులకు శిక్షణ.
ఔషధ మరియు సుగంధ మొక్కల కేంద్రీయ సంస్ధ (CIMAP) గత 2005 నవంబర్ 28-30 తేదీల్లో నిర్వహించిన శిక్షణా శిబిరంలో 'విస్టా' సభ్యురాలితో పాటు ఇద్దరు రైతులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న సభ్యులకు అవసరమైన మేరకు సమగ్ర సమాచారాన్ని అందించారు. అయితే, సర్టిఫికెట్ల ప్రదానం సందర్బంగా తమ ఔషధ మరియు సుగంధ మొక్కల పెంపకం ప్రాజెక్టు కింద చిట్లంకుంట గ్రామాన్ని కూడా చేర్చమని మేము CIMAP అధికారులను కోరగా, అందుకు వారు అంగీకరించారు. ఇందులో మొదటి చర్యగా, గ్రామంలోని స్వయం సహాయక బృందాల నుంచి 20 మంది భాధ్యతాయుతమైన మహిళలను గుర్తించాలని వారు మమ్మల్ని కోరారు. ఇందుకోసం గత 2005 డిసెంబర్ 5న జరిగిన 'సమాఖ్య' సమావేశంలో ఈ 20 మంది మహిళలను గుర్తించాము. ఆ తర్వాత సుమారు 25 మంది మహిళలకు CIMAP శిక్షణ ఇవ్వగా వారిలో 14 మంది మహిళలు మొక్కల పెంపకానికి సంసిద్ధత వ్యక్తంచేశారు.